ఒక్క వానకే బడి చెరువైంది

ఒక్క వానకే బడి చెరువైంది

భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ మంగళవారం ఉదయం కురిసిన ఒక్క వానకే చెరువును తలపించింది. ఇక్కడ మొత్తం120 మంది స్టూడెంట్లు చదువుకొంటుండగా.. బడికి వచ్చి వెళ్లేటప్పుడు, బ్రేక్​టైంలో ఇబ్బందులు పడ్డారు. స్కూల్​బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ కింద రూ.39లక్షలు కేటాయించింది. అదనపు గదుల నిర్మాణం చేపట్టి ఏడాది అవుతున్నా నేటికీ పూర్తికాలేదు. 

దీంతో స్టూడెంట్లు శిథిలావస్థకు చేరిన క్లాస్​ రూముల్లోనే పాఠాలు వింటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసేలా చూడాలని, స్కూల్ ఆవరణలో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

వెలుగు, జూలూరుడు