అమెరికాలోని 4 ఎయిర్ పోర్టు కంప్యూటర్లు హ్యాక్: నెతన్యాహు, ట్రంప్ ని తిడుతూ అనౌన్స్‌మెంట్స్.. పాలస్తీనాకి అనుకూలంగా నినాదాలు..

అమెరికాలోని 4 ఎయిర్ పోర్టు కంప్యూటర్లు హ్యాక్: నెతన్యాహు, ట్రంప్ ని తిడుతూ అనౌన్స్‌మెంట్స్.. పాలస్తీనాకి అనుకూలంగా నినాదాలు..

మంగళవారం నార్త్ అమెరికాలోని కొన్ని ఎయిర్‌పోర్ట్‌లలో  నెతన్యాహు & ట్రంప్ ని తిడుతూ వచ్చిన అనౌన్స్‌మెంట్‌ ప్రయాణికులను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత హమాస్‌కు మద్దతు ఇస్తూ అమెరికా, ఇజ్రాయెల్ నాయకులను తిడుతూ పాలస్తీనాకు అనుకూలమైన అనౌన్స్‌మెంట్‌లు వరుసగా వినిపించాయి.

పెన్సిల్వేనియాలోని హారిస్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు కెనడాలోని కెలోవానా, విక్టోరియా, విండ్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల టెర్మినల్స్‌లో కూడా ఈ అనౌన్స్‌మెంట్‌లు వినిపించాయి. దీనితో అక్కడ ఒక్కసారిగా గందరగోళం చెలరేగి, అందరూ భయపడ్డారు. దింతో  ఎయిర్‌పోర్ట్‌ సిస్టమ్స్ పై  సైబర్ దాడి జరిగిందేమో అని అనుమానించి చర్యలు చేపట్టారు. 

ట్రంప్ & నెతన్యాహుపై అసభ్య పదాలు : హారిస్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో షాక్‌కు గురైన ప్రయాణికులు తీసిన వీడియోలలో ఇంటర్‌కామ్‌లో ఆ అసభ్య అనౌన్స్‌మెంట్‌ను ప్లే అవుతున్నట్లు కనిపించింది. దీనివల్ల ఎయిర్‌పోర్ట్ పనులు ఆగిపోయాయి అలాగే  అధికారులు సిస్టమ్స్ ను మళ్లీ కంట్రోల్లోకి  తీసుకోవడానికి ప్రయత్నాలు చేపట్టారు. "F*** నెతన్యాహు & ట్రంప్, ఇక్కడ టర్కిష్ హ్యాకర్ సైబర్ ఇస్లాం. టెలిగ్రామ్ ఛానల్ సైబర్ ఇస్లాం ఫ్రీ పాలస్తీనా. ఫ్రీ ఫ్రీ పాలస్తీనా. ఫ్రీ ఫ్రీ పాలస్తీనా," అంటూ ఒక వైరల్ వీడియోలో అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తుంది.

కెలోవానా ఎయిర్‌పోర్ట్‌లో ఈ దాడి చాలా తీవ్రంగా జరిగింది. హ్యాకర్లు విమానాల సమాచారం చూపించే స్క్రీన్లు, అనౌన్స్‌మెంట్‌లు చేసే PA సిస్టమ్స్  రెండింటినీ ఆక్సెస్ చేశారని తెలిసింది. టెర్మినల్ లోపల ఉన్న స్క్రీన్లు హమాస్‌కు అనుకూలమైన నినాదాలను చూపించాయి, ఇంకా  ఇంటర్‌కామ్‌లో కూడా అదే రికార్డింగ్‌లు ప్లే అయ్యాయి. ఎయిర్‌పోర్ట్ అధికారులు హ్యాకింగ్‌ను అంగీకరించి, రికార్డింగ్‌లు అనౌన్స్‌మెంట్‌  తీసేశామని, పనులను మళ్లీ సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

విక్టోరియా ఎయిర్‌పోర్ట్ ఈ సంఘటనను, క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా అనధికార ఆడియో అనౌన్స్‌మెంట్‌ ప్లే అయిందని వివరించింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని హామీ ఇస్తూ ఎయిర్‌పోర్ట్ క్షమాపణలు చెప్పింది. విండ్సర్‌లో విమానాలు లేకపోవడంతో  ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే ఈ సమస్యను ఆపగలిగారు. మా టీమ్ త్వరగా స్పందించి, ఫోటోలు తీసివేసి, రికార్డ్ చేసిన అనౌన్స్‌మెంట్‌ను ఆపేసింది అని అధ్యక్షుడు మార్క్ గాల్విన్ చెప్పారు. 

హ్యాకర్లను పట్టుకోవడానికి దర్యాప్తు: ఎయిర్‌పోర్ట్ పనులను చూసే ట్రాన్స్‌పోర్ట్ కెనడా, ఈ చొరబాట్లు ఎలా జరిగాయో తెలుసుకోవడానికి, అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆపడానికి పోలీసులు, ప్రభుత్వ భద్రతా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా విమానయాన వ్యవస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్న సమయంలో ఈ ఘటనలు జరిగాయి. ఈ మధ్య కాలంలో హ్యాకర్లు చాలా దేశాలలో ఎయిర్‌లైన్స్, చెక్-ఇన్ సిస్టమ్స్, ఎయిర్‌పోర్ట్ నెట్‌వర్క్‌లను చాల ఇబ్బంది పెట్టారు.

యునైటెడ్ స్టేట్స్, కెనడా అధికారులు ఇప్పుడు ఈ రాజకీయ హ్యాక్‌ల గురించి విచారణ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లలో ఉపయోగించే ఒకే రకమైన కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను ఉపయోగించుకున్న హమాస్ మద్దతు సైబర్ గ్రూపులతో దీనికి సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.