శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో కరెన్సీ కట్టలు

శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో కరెన్సీ కట్టలు

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం ప్రెసిడెంట్ గొటబయ రాజపక్స ఇంట్లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టారు. తాజాగా అధ్యక్షుడి నివాసంలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో రాజపక్స ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు బయటపడటంపై జనం మండిపడుతున్నారు. డైలీ మిర్రర్ కథనం ప్రకారం.. ఆ డబ్బునంతా భద్రతా బలగాలకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.  అధ్యక్షుడి నివాసంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇదిలా ఉంటే దేశమంతా కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో రాజపక్స నివాసంలో ఎవరూ లేకపోయినా ఏసీలు పనిచేస్తూనే ఉండటంపై ఆందోళనకారులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం గొటబయ అజ్ఞాతంలో ఉండగా.. ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ  నేపథ్యంలో ఆందోళనకారులు హింసకు పాల్పడవద్దని ఆర్మీ చీఫ్ అభ్యర్థించారు. మరోవైపు శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్యా టూరిజం శాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో, లేబర్ మినిస్టర్ మానుష నానాయక్కర పదవి నుంచి తప్పుకున్నారు.