నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 174 ఫిర్యాదులు

నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి   174 ఫిర్యాదులు

నిజామాబాద్,  వెలుగు : నిజామాబాద్ కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి ఆదేశించారు.  కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ కిరణ్​కుమార్, నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, హౌసింగ్ పీడీ పవన్​కుమార్, ఏసీపీ వెంకటేశ్వర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కామారెడ్డిలో 80 ఫిర్యాదులు    

కామారెడ్డిటౌన్​ : కామారెడ్డి కలెక్టరేట్​లో 80 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ , అడిషనల్​ కలెక్టర్లు విక్టర్​, మదన్​మోహన్​,  ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​  రవితేజ,  సబ్ కలెక్టర్  కిరణ్మయి, ఆర్డీవోలు వీణ, పార్థసారథిరెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు.  ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.