రికార్డు గ్రాండ్ స్లామ్ వేటలో నడాల్

రికార్డు గ్రాండ్ స్లామ్ వేటలో నడాల్

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రెంచ్​ ఓపెన్​కు రంగం సిద్ధమైంది..!  టెన్నిస్​ బిగ్-3 టైటిల్​పై కన్నేయగా, కుర్రాళ్లందరూ మెరుగైన పెర్ఫామెన్స్ చూపెట్టేందుకు ఎదురుచూస్తున్నారు..! అమెరికా లేడీ సూపర్​ స్టార్ సెరెనా విలియమ్స్​ కూడా రికార్డు టైటిల్​ కోసం వేట మొదలు పెట్టనుంది..!  అయితే, అందరి దృష్టి మాత్రం  క్లే కోర్ట్‌‌‌‌ కింగ్‌‌‌‌ రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌పైనే ఉంది.!  ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో ఇప్పటికే 13 టైటిల్స్‌‌‌‌ నెగ్గిన రఫా.. తనకు అచ్చొచ్చిన వేదికపై ఇంకోసారి విజేతగా నిలిచి... మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో  రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్నాడు. 

పారిస్:  టెన్నిస్​ ఫ్యాన్స్‌‌‌‌ను అలరించేందుకు ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ వార్‌‌‌‌కు తెరలేచింది. కరోనాను పక్కనబెడుతూ.. బరిలోకి దిగేందుకు టాప్​ స్టార్లు, యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ రెడీ అయ్యారు. రొలాండ్‌‌‌‌ గారోస్‌‌‌‌లోని మట్టి కోర్టుల్లో తమ ఆటతో దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్న బిగ్​–3 ప్లేయర్లు రోజర్​ ఫెడరర్ (స్విట్జర్లాండ్​)​, రఫెల్​ నడాల్​ (స్పెయిన్​), నొవాక్​ జొకోవిచ్ (సెర్బియా)​.. టైటిల్​పై కన్నేశారు.  ఆదివారం నుంచి జరిగే టోర్నీలో టైటిలే లక్ష్యంగా ఈ ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. అయితే ఇందులో ఎవరు గెలిచినా.. టైటిల్​తో పాటు రికార్డులను మూటగట్టుకోనున్నారు. ప్రస్తుతం కెరీర్​లో అత్యధిక గ్రాండ్​ స్లామ్స్​ గెలిచిన ప్లేయర్లలో ఫెడరర్​ (20), నడాల్​ (20) సమంగా ఉన్నారు. దీంతో 14వ ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​పై కన్నేసిన మూడో సీడ్‌‌‌‌  స్పెయిన్​ స్టార్.. మరో టైటిల్​తో టాప్​ ప్లేస్​ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.  2016 చాంపియన్​ అయిన టాప్‌‌‌‌ జొకోవిచ్​..తన గ్రాండ్​స్లామ్స్​ సంఖ్యను 19కు పెంచుకోవాలని భావిస్తున్నాడు. అదే జరిగితే అతను  ఓ అరుదైన రికార్డు కూడా అందుకుంటాడు.  దాదాపు 50 ఏళ్ల తర్వాత నంబర్​వన్​ ప్లేస్​లో ఉండి  నాలుగు మేజర్​ టైటిల్స్​ను ఒకటి కంటే ఎక్కువసార్లు నెగ్గిన తొలి ప్లేయర్​గా రికార్డు సృష్టిస్తాడు. ఇక నడాల్​, జొకో, ఫెడెక్స్​ ముగ్గురూ ఒకే పార్శంలో ఉండటంతో.. జూన్​ 13న జరిగే ఫైనల్లో ఒకరికే చోటు దక్కే చాన్స్​ ఉంది.  ఫలితంగా జొకోవిచ్​.. క్వార్టర్స్​లో ఫెడరర్​ను అడ్డుకుంటే సెమీస్​లో నడాల్​ను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ‘డ్రా గురించి పెద్దగా ఆందోళన లేదు. ఎందుకంటే ఇదంతా నార్మల్​గా జరిగేది. జొకోవిచ్​తో మ్యాచ్​ కోసం నేను చాలా కసరత్తు చేశా’ అని నడాల్​ పేర్కొన్నాడు. నడాల్​ ఇప్పటికే బార్సిలోనా, రోమ్​ టైటిల్స్​ నెగ్గడంతో ఇప్పుడు అందరి దృష్టి అతనిపైనే నెలకొంది. లాస్ట్​ ఇయర్ రొలాండ్​ గారోస్​లో వరుస సెట్లలో జొకోవిచ్​ను ఓడించడం కూడా నడాల్​కు కాన్ఫిడెన్స్​ను పెంచే అంశం. అయితే గాయం కారణంగా కొన్ని రోజుల నుంచి  ఆటకు దూరంగా ఉన్న  ఎనిమిదో సీడ్‌‌‌‌ ఫెడరర్.. ఈ టోర్నీలో ఎలా ఆడతాడన్నది కూడా ఆసక్తికరంగా మారింది. క్లే కోర్టులో మంచి రికార్డు లేకపోవడంతో ఈ టోర్నీలో ఫెడెక్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నెగ్గితే ఆశ్చర్యమే. ఫస్ట్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో   అమెరికా ప్లేయర్‌‌‌‌ సాండ్‌‌‌‌గ్రెన్‌‌‌‌తో జొకోవిచ్‌‌‌‌ పోటీ పడనుండగా... ఆస్ట్రేలియాకు చెందిన పోపిరిన్‌‌‌‌తో నడాల్‌‌‌‌, క్వాలిఫయర్‌‌‌‌ ఇస్తోమిన్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌)తో ఫెడెక్స్‌‌‌‌ తమ పోరు ఆరంభిస్తారు. ఇక,  మిగతా వారు కూడా తమ ర్యాంక్​లను మెరుగుపర్చుకోవడంతో పాటు  మెరుగైన పెర్ఫామెన్స్​చూపేందుకు రెడీ అవుతున్నారు. వీళ్లలో  నెక్స్ట్​ బిగ్‌‌‌‌ ప్లేయర్లుగా భావిస్తున్న వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ 2 డానిల్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌ (రష్యా),  2018, 2019 సీజన్ల రన్నరప్‌‌‌‌, నాలుగో సీడ్‌‌‌‌ డొమినిక్‌‌‌‌ థీమ్‌‌‌‌ (ఆస్ట్రియా), ఐదోసీడ్‌‌‌‌ స్టెఫనోస్‌‌‌‌ సిట్సిపాస్‌‌‌‌ (గ్రీస్‌‌‌‌), ఆరో సీడ్‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌ (జర్మనీ) నుంచి నడాల్‌‌‌‌, జొకోకు సవాల్‌‌‌‌ ఎదురవనుంది. కాగా,ఈ టోర్నీలో ఇండియా నుంచి రోహన్‌‌‌‌ బోపన్న, దివిజ్‌‌‌‌ శరణ్‌‌‌‌ మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

ఫ్యాన్స్​కు అనుమతి..

ఫ్యాన్స్​కు ఈసారి కూడా పర్మిషన్​ ఇచ్చారు. అయితే గతంలో మాదిరిగా 10 వేల మంది కాకుండా ప్రతి మ్యాచ్​కు కేవలం 5 వేల మంది వరకు అనుమతిస్తారు. అది కూడా కొవిడ్​ రిస్ట్రిక్షన్స్​ కచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఫ్యాన్స్​ కోసం ఆరు జోన్స్​ ఏర్పాటు చేశారు. జూన్​ 9న గవర్నమెంట్​ కొన్ని రిస్ట్రిక్షన్స్​ సడలించే చాన్స్​ ఉండటంతో.. మరింత మంది ఫ్యాన్స్​ను అనుమతించనున్నారు. క్వార్టర్​ఫైనల్ నుంచి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే స్టేడియానికి వచ్చే ప్రతి ఒక్కరు నెగెటివ్​ సర్టిఫికేట్​ లేదా వ్యాక్సినేషన్​ సర్టిఫికేట్​, లేదా యాంటీ బాడీ టెస్ట్​కు సంబంధించిన రిపోర్ట్స్​ను చూపెట్టాలి.