మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

రెండు రోజులు ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

 నిన్న(సోమవారం) మరట్వాడ నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఉన్న ద్రోణి ఇవాళ(మంగళవారం) బలహీనపడిందని తెలిపింది.