S.S. Rajamouli: జక్కన్న ప్రొఫైల్‌‌‌‌ ‘ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌’.. ఆర్మీ ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దంటూ ట్వీట్

S.S. Rajamouli: జక్కన్న ప్రొఫైల్‌‌‌‌ ‘ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌’.. ఆర్మీ ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దంటూ ట్వీట్

‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా..’అంటూ ‘ఆర్ఆర్ఆర్’చిత్రంలోని పాటలో తన దేశభక్తిని చాటిన దర్శకుడు రాజమౌళి.. భారత్ - పాకిస్తాన్ దేశాల‌‌‌‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  దేశాన్ని ఉగ్రవాదం నుండి కాపాడటంలో ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను  ప్రశంసించారు.

భారత సైన్యం యొక్క కదలికలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి షేర్ చేయవద్దని రాజమౌళి కోరారు. ఇలా చేయడం వల్ల శత్రువుకు సహాయం చేసిన వాళ్లవుతారని, అలాగే అనధికారిక వార్తలు, అసత్య ప్రచారాలను ఫార్వర్డ్ చేయడం కూడా ఆపాలని ఆయన సూచించారు.

మీ నుంచి ఇలాంటివే శత్రువు కోరుకుంటాడని, కానీ ప్రశాంతంగా, పాజిటివ్‌‌‌‌గా, అప్రమత్తంగా ఉంటే విజయం మనదేనని రాజమౌళి రాసుకొచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌’ని తన ప్రొఫైల్‌‌‌‌ ఫొటోగా మార్చుకున్నారు రాజమౌళి.