- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: వానాకాలం సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ట్యాగ్ చేసిన మిల్లర్లు ఎప్పటికప్పుడు వడ్లను దింపుకోవాలని రాజన్నసిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వడ్లు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై జిల్లాలోని రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు, జిన్నింగ్ మిల్లర్లు, వివిధ శాఖల ఆఫీసర్లతో మంగళవారం కలెక్టరేట్‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ రూల్స్‌కు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ట్యాగ్ చేసిన మిల్లర్లు, రైస్ మిల్లర్లు ధాన్యాన్ని వెంట వెంటనే దించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
2024–25 వానాకాలం, యాసంగి సీజన్ సంబంధించిన సీఎంఆర్ గడువులోగా అందించాలని ఆదేశించారు. జిల్లాలోని ఐదు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి రైతులకు వసతులు కల్పించాలన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధర, కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ తదితర అంశాలు తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు మక్క కొనుగోలు సెంటర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఆర్డీవో శేషాద్రి, డీసీఎస్‌వో చంద్ర ప్రకాశ్, డీఏవో అఫ్జల్ బేగం, డీసీవో రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాశ్, మార్క్‌ఫెడ్ అధికారి హబీబ్, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జనరల్ హాస్పిటల్ తనిఖీ
సిరిసిల్ల టౌన్, వెలుగు: డాక్టర్లు రోగులకు చిత్తశుద్ధితో వైద్యసేవలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ఆమె మంగళవారం సందర్శించారు. దవాఖానలోని మెటర్నిటీ, ఆప్తమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్త పరీక్షల ల్యాబ్‌ను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. దవాఖానలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్వహించిన సదరం శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్, డీఆర్డీవో శేషాద్రి, డాక్టర్లు సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీపీఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
