సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఎవర్ గ్రీన్ ఐకానిక్ ఫిల్మ్ నరసింహ (Narasimha). ఈ సినిమా రిలీజై 25 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ వైబ్ సినీ అభిమానులను టచ్ చేస్తూనే ఉంటుంది. ఈ నెల 12న రజినీ తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నరసింహ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇదే వేడుక సందర్భంగా నరసింహ పార్ట్ 2ని అనౌన్స్ చేయబోతున్నట్లు రజీని తెలిపారు.
లేటెస్ట్గా నరసింహ రీ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా రజనీ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో నరసింహ సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ..‘‘ఇండియన్ సినిమాల్లో ఐకానిక్ ఫిల్మ్ నరసింహ. ఈ సినిమా చూడటానికి ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టి థియేటర్లలోకి వచ్చి చూశారు. అందువల్ల ‘నరసింహ’ లాంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ తీయనున్నాం. ప్రస్తుతం ఎన్నో సినిమాల సీక్వెల్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఎందుకు తీయకూడదు? అనే ప్రశ్న నాలో మొదలైంది. నా నుంచి 2.0 (రోబో సీక్వెల్), జైలర్ 2 చేసేటప్పుడే, నరసింహ రెండో భాగాన్ని కూడా తీసుకురావాలని ఫిక్స్ అయ్యాం. ఈ పార్ట్2 కి ‘నీలాంబరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ప్రస్తుతం దీని కథాచర్చలు నడుస్తున్నాయి’’ అని రజనీకాంత్ వెల్లడించారు.
என் திரை வாழ்வில் படையப்பா மிகவும் முக்கியத்துவம் வாய்ந்தது. அந்தப் பட நினைவுகள் சிலவற்றை உங்களுடன் பகிர்ந்துக் கொள்கிறேன். #Padayappahttps://t.co/bHMT39f1Wh pic.twitter.com/pRaPmOE5Mv
— Rajinikanth (@rajinikanth) December 8, 2025
నరసింహ విశేషాలు:
నరసింహ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు రజినీ. ఆ సినిమాలో ఆయన పాత్రని, స్టైల్‌ని, డైలాగ్స్‌ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా ‘నా దారి రహదారి’ అనే డైలాగ్‌ని ఇప్పటికీ చాలామంది వాడుతుంటారు. అంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తుండటం సూపర్ కిక్ ఇచ్చే అప్డేట్ అనే చెప్పుకోవాలి.
డైరెక్టర్ కే ఎస్ రవికుమార్‌తో ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్‌లో కూర్చున్నారట రజినీ. అంతేకాదు.. స్టోరీ డెవెలప్‌మెంట్‌లోనూ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి కథకు ఎక్సైటింగ్ రూపం తీసుకొచ్చారట. అప్పట్లో నీలాంబరిగా తనదైన ముద్రవేసుకున్న రమ్యకృష్ణ.. ఈ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 12న అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది.

