సినిమాల్లోకి రాకముందు హీరోయిన్ శ్రీయతో రామ్ చరణ్..

సినిమాల్లోకి రాకముందు హీరోయిన్ శ్రీయతో రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినీ ఎంట్రీ చిరుత మూవీతో అని అందరికీ తెలిసిందే. అంతకు ముందు చరణ్ సినిమాల్లో రావడం కోసం యాక్టింగ్లో శిక్షణ తీసుకుంటూ..చిరు తనయుడిగా అక్కడక్కడ కనిపించేవాడు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే..చరణ్ రంగస్థలం మూవీతో పాన్ ఇండియా స్థాయిని..RRR మూవీతో పాన్ వరల్డ్ స్థాయిని చేరుకున్నాడు.

లేటెస్ట్గా చరణ్ సినిమాల్లోకి రాక ముందు కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో చరణ్ ఒక్కడే కాదు..అందాల భామ శ్రియ (Shriya) కూడా పక్కన కనిపిస్తోంది. అదేంటి, వీరిద్దరూ కలిసి వర్క్ చేసిన సినిమా కూడా ఉందా? అని మీకు డౌట్ రావొచ్చు. కానీ, RRR మూవీలో తప్పితే..ఇంకా ఏ మూవీలో చేయలేదు. అది కూడా అజయ్ దేవ్‌గణ్కి వైఫ్గా నటించింది.

ఈ వీడియోలో చాలా యంగ్గా ఉన్నచరణ్..చిరుత సినిమా కోసం యాక్టింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ వీడియోను తీసి ఉంటారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్‌ అన్నట్లుగా చరణ్..శ్రియ ఆకట్టుకుంటున్న వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి లుక్కేయండి..

రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ మూవీలో నటిస్తున్నారు. కార్తిక్‌ సుబ్బరాజ్‌ అందించిన స్టోరీతో శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ కథా చిత్రంగా ఇది సిద్ధమవుతోంది. రామ్‌చరణ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా అడ్వాణీ కథానాయిక. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా తో మరో మూవీ చేస్తున్నాడు.