
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా మార్చి 8న సినిమా విడుదల కానుంది. రిలీజ్‌డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతూ బుధవారం వందరోజుల కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో హీరో రామ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’కు సంగీతం అందించిన మణిశర్మ మరోసారి ఈ కాంబినేషన్‌లో వర్క్ చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానుంది.