సినిమా అంటే పిచ్చి, ప్యాషన్‌‌‌‌..‘మనం ఏమిటో ఊళ్లో అందరికీ తెలుసు

 సినిమా అంటే పిచ్చి, ప్యాషన్‌‌‌‌..‘మనం ఏమిటో ఊళ్లో అందరికీ తెలుసు

నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగబలి’. యుక్తి తరేజ హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జులై 7న విడుదలవుతున్న సందర్భంగా నాగశౌర్య ఇలా ముచ్చటించాడు. 

‘మనం ఏమిటో మన ఊళ్లో అందరికీ తెలుసు. మన సొంత ఊరు అనే ఫీలింగే వేరు. ఈ సినిమా చూస్తున్నపుడు అలా మళ్ళీ మన రూట్స్ ని టచ్ చేసి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది.  ఏ దర్శకుడైనా నటుడికి స్పేస్ ఇవ్వాలి. ఈ సినిమాలో పవన్ ఆ స్పేస్ ఇచ్చాడు. నా ఎక్స్‌‌‌‌పీరియన్స్, దర్శకుడి విజన్ కలిసి అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాం. యుక్తి తరేజ చాలా మంచి నటి, డాన్సర్. తను తెలుగులో లీడింగ్ హీరోయిన్ అయ్యే చాన్సెస్‌‌‌‌ ఉన్నాయి. పవన్ సి.హెచ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకముంది. సినిమా చూశాక వచ్చిన నమ్మకంతోనే ఇంత కాన్ఫిడెంట్‌‌‌‌గా చెప్పగలుగుతున్నాను.

 కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం నుండి నేను మాస్‌‌‌‌, యాక్షన్ ఎలిమెంట్స్‌‌‌‌ లాంటివన్నీ ట్రై చేస్తూనే ఉన్నా. శౌర్యకు అది సెట్ అవుతుంది, ఇది సెట్ కాదు అని కొందరు అంటుంటారు. నాకదే నచ్చదు. నేను అదే చేయగలనని మీరెలా జడ్జ్ చేస్తారు. అలా జడ్జ్ చేయడం తప్పు. అలా తప్పుగా జడ్జ్ చేసిన ప్రతిసారి తెలుగు ఇండస్ట్రీలో ఒక్కడు, పోకిరి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతాలు వచ్చాయి. ఇక మా బ్యానర్‌‌‌‌‌‌‌‌ విషయానికొస్తే.. సినిమా అంటే పిచ్చి, ప్యాషన్‌‌‌‌తో సినిమాలు నిర్మిస్తున్నాం తప్పితే డబ్బు సంపాదించాలని కాదు. నా నెక్స్ట్ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ మూవీ రిలీజ్‌‌‌‌ తర్వాత సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్‌‌‌‌ చేస్తాం’.