గిరిజన బాలికను బెదిరించి అత్యాచారం

గిరిజన బాలికను బెదిరించి అత్యాచారం

ఇల్లెందు, వెలుగు: గిరిజన బాలికను బెదిరించి అత్యాచారం చేసిన ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఇల్లెందు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) ముకుందపురం క్యాంపు సెంటర్​లోని ఓ హోటల్​లో పనిచేస్తోంది. అదే ఏరియాలో సెలూన్​నడుపుతున్న మార్కాపురం జగదీశ్(25) కొన్నిరోజులుగా ఆమెను గమనిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆమెతో మాట్లాడేవాడు. కాగా 2 రోజుల క్రితం బాలిక గ్రామ సమీపంలోని జామాయిల్ తోటలో బహిర్బూమికి వెళ్లడం గమనించిన జగదీశ్ ​వెంబడించాడు. నిర్మానుష ప్రాంతంలోకి వెళ్లగానే ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు.  బయటికి వెళ్లిన కూతురు రాకపోవడంతో తల్లిదండ్రులు వెతుకుతుండగా బాలిక ఏడుస్తూ వచ్చింది. జరిగిన విషయాన్ని వారికి వివరించింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు ఫైల్​అయ్యింది. జగదీశ్​ గతంలోనూ ఓ బాలికపై అత్యాచార యత్నం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.