
వింత ఆవుదూడ జననం..రెండు తలలు, మూడు కళ్లు..భగవంతుని మహిమ, స్వరూపం అని ప్రజలు పూజలు..అద్భుతమైన వింత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు, చుట్టు పక్కల గ్రామాల వారు వస్తున్నారు. ఈ అరుదైన ఘటన యూపీలోని భాగ్ ఫత్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని భాగ్పత్లోని తిక్రి గ్రామంలో రెండు తలలతో ఓ దూడ జన్మించింది. ఆ దూడకు 2 తలలు ,3 కళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఉంది. బాగ్పత్ చుట్టుపక్కల స్థానికులు ,ప్రజలు ఈ వింత దృశ్యాన్ని చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
बागपत
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) June 19, 2025
➡गाय ने दिया अद्भुत बछड़े को जन्म
➡दो मुंह और तीन आंख वाला बछड़ा
➡बछड़े को देखने के लिए ग्रामीणों की भीड़
➡दोघट थाना के टीकरी गांव का मामला.#Baghpat @Dept_of_AHD pic.twitter.com/33UO8IPedH
జూన్ 18న ఈ వింత ఆవుదూడ జన్మించింది..స్థానికులు, చుట్టు పక్కల గ్రామాల వారు దీనిని ఓ మహిమగా చూస్తున్నారు.. దూడను దేవుని ఆశీర్వాదంగా పూజిస్తున్నారు. కొందరు ఆ దూడకు కానుకలు కూడా పెట్టి వెళ్తున్నారని ఆవు యజమాని చెప్పారు.
Also Read : జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపుకు రంగం సిద్దం
రెండు తలల దూడ జననం ఇప్పుడు తిక్రి లో చర్చనీయాంశంగా మారింది. నేలపై వింత దూడ ..దాని చుట్టూ చాలా మంది జనం గుమికూడిన ఫొటోలు వీడియోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. సందర్శకులు దీనిని ప్రకృతి అద్భుతంగా చెప్పుకుంటున్నారు. రెండు తలల ఆవుదూడ జననంతో ఆ గ్రామంలో కొత్త సందడి నెలకొంది.
రెండు తలల దూడ: వైద్యులేమంటున్నారంటే..
పశువైద్య వర్గాల సమాచారం ప్రకారం..దీనిని రెండు తలల ఆవు, లేదా పాలీసెఫాలీ దూడ అని కూడా పిలుస్తారు. ఇది రెండు తలలతో జన్మించిన జంతువు. ఇది అరుదైన పుట్టుక. పిండం అసంపూర్ణంగా విడిపోవడం లేదా రెండు పిండాల కలయిక కారణంగా సంభవిస్తుంది. ఈ పరిస్థితి ఉన్న చాలా దూడలు చనిపోయి జన్మించినప్పటికీ, కొన్ని స్వల్ప కాలం జీవించగలవని పశువైద్యులు చెబుతున్నారు
గతంలో ఇలాంటి ఘటనలు..
భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇటీవల సెప్టెంబర్ 2024లో మంగళూరులోని కిన్నిగోలి ప్రాంతానికి చెందిన జయరామ్ జోగి తన ఆవు రెండు తలలు కలిగిన దూడకు జన్మనిచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి.