ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

V6 Velugu Posted on Oct 12, 2021

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్టణంలో ఎడ్ సెట్ కన్వీనర్ విశ్వేశ్వరరావు ఫలితాలను విడుదల చేశారు. 2021 ఎడ్ సెట్ పరీక్షకు 15 వేల 638 మంది దరఖాస్తు చేసుకోగా 13 వేల 619 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 13వేల 428 మంది (98.60శాతం) అర్హత సాధించారు. గత ఏడాది గణాంకాల ప్రకారం దాదాపు 42వేల సీట్లు ఖాళీగా ఉండగా కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి తెలియజేసింది. 
 

Tagged Amaravati, Andhra Pradesh, results, Visakha, VIZAG, visakhapattanam, Higher Education Council, , ap updates, EDCET-2021

Latest Videos

Subscribe Now

More News