రోడ్డు ప్రమాదం: ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి

V6 Velugu Posted on Jul 26, 2021

వికారాబాద్ జిల్లా:  ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఈ సంఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లాలో జరిగింది. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉంది. పూడూర్‌ మండలం మన్నెగూడ వద్ద ధరణి కాటన్‌ మిల్‌ సమీపంలో క్వాలీస్‌ వాహనం ఎక్సల్‌ రాడ్‌ విరిగిపోవడంతో.. ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలొ ఒకే ఫ్యామిలీకి చెందిన మల్లికార్జున్‌ రెడ్డి, రాజ్యలక్ష్మి, దేవాన్షురెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.
 

Tagged Vikarabad district, killed, family, , road accident

Latest Videos

Subscribe Now

More News