ఆడవాళ్లకు అండగా రోజెస్​ ఆర్​ రెడ్​

V6 Velugu Posted on Jul 19, 2021

శారదా.. షర్ట్ మీద ఈ మరకలేంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా బట్టలు జాగ్రత్తగా ఉతకమని.. అని అప్పుడే ఆఫీస్​కి రెడీ అవుతున్న రమేష్ వంటింట్లో లంచ్​ బాక్స్​ కడుతున్న తన భార్య మీద కేకలేశాడు. ఆమెకి ఇదేం మొదటిసారి కాదు. ఇలా ఎన్నోసార్లు, టీలో చక్కెర తక్కువైందని, కూరల్లో ఉప్పు ఎక్కువైందని.. ఇలా చీటికి మాటికి ఆమెపై అరిచేవాడు. ఇది  ఏ ఒక్క ఇల్లాలో పడే బాధ కాదు. దాదాపు ప్రతి ఇంటిలో రోజూ జరిగేవే. కానీ వాటివల్ల ఆడవాళ్లు ఎమోషనల్​గా, మెంటల్​గా, ఫిజికల్​గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందైతే వాళ్ల బాధను ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. అమ్మానాన్నలు బాధ పడతారనో, చుట్టాలకు చులకన అవుతామనో, ఫ్రెండ్స్​ జాలి పడతారనో, ఎగతాళి చేస్తారేమోనన్న ఆలోచనలతో బయటకు అడుగేయకుండా ఆగిపోతున్నారు. అందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్​ అవుతూ, లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. లాక్​డౌన్​లో గృహ హింస కేసులు ఎక్కువయ్యాయనే వార్తలు కోకొల్లలు. మరి ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి? అన్నది వాటిని అనుభవిస్తున్న ఆడవాళ్లకు సవాల్​గా మారింది. గృహహింసను కంట్రోల్​ చేయడం కోసం చట్టాలున్నాయి కదా! అంటే, అవి ఎంతమందికి తెలుసు? అంత ధైర్యం ఎవరు చేస్తారు? పరువు గురించో, ఆత్మాభిమానం అడ్డొచ్చో ఆగిపోతారు. అలాంటప్పుడు ఎన్ని చట్టాలున్నా, సమస్యలు తీరవు. కొంతమంది ఆడవాళ్లయితే ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తున్నారు. వాళ్ల పుట్టింటికి వెళ్లలేక, ఒంటరిగా రూం తీసుకుని, ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇంకొందరైతే టార్చర్​ భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఆలోచన చాలామందిలో వస్తోందని స్టడీస్​ కూడా చెబుతున్నాయి. 
‘నేనున్నా’ అనే భరోసా!
స్వచ్ఛంద సంస్థలు, హెల్ప్​ లైన్​ సెంటర్స్, హోంల వంటివి ఇలా సమస్యల్లో ఉన్న ఆడవాళ్లకు అండగా నిలుస్తున్నాయి. వాటిని ఉపయోగించుకుంటే చాలామంది ప్రాబ్లమ్స్​కి సొల్యూషన్​ దొరుకుతుంది. కానీ వాటిని కనుక్కోవడం ఎలా? వాళ్లనెలా కలవాలి? వంటి ప్రశ్నలకు సమాధానమే  ‘3.a.m ఫ్రెండ్​’. ‘3.a.m ఫ్రెండ్​’ అంటే ఏ టైంలోనైనా నీకు నేనున్నా! అనే భరోసా ఇచ్చే ఫ్రెండ్ ప్రతి ఒక్కరి లైఫ్​లో ఒకరుంటారు. వాళ్లు ఎక్కడో ఉండరు. ఫ్రెండ్స్​లోనో, రిలేటివ్స్​లోనో, పక్కింటివాళ్లలోనో ఎవరో ఒకరు రోజూ ఆ పరిస్థితుల్ని చూస్తుంటారు. కాబట్టి వాళ్లు హెల్ప్​ చేయడానికి ముందుకొస్తారు. అలాంటి వాళ్లను గుర్తించాలి. సో, ఇంట్లో వయొలెన్స్​ని ఫేస్​ చేయాల్సి వచ్చినప్పుడు, వెంటనే వాళ్లకు తెలియజేయాలి. అది కూడా కోడ్​ లాంగ్వేజ్​లో. ‘రోజెస్​ ఆర్​ రెడ్​’ అ​ని వాళ్లకు పంపాలి. దానర్థం వెంటనే సాయం కావాలి అని. అది​ చూసి అవతలి వాళ్లు అర్థం చేసుకుంటారు. వీలయితే వాళ్లు వచ్చి మాట్లాడి, కన్విన్స్​ చేయడానికి ప్రయత్నిస్తారు. విషయం పెద్దదైతే వెంటనే పోలీస్​ కంప్లైంట్​ చేయడానికి హెల్ప్​ చేస్తారు. ఇలాంటి సిచ్యుయేషన్​లో ఎవరైనా ఉన్నారనిపిస్తే వెంటనే వాళ్లతో మాట్లాడడం మంచిది. అప్పుడే వాళ్లు ధైర్యంగా వాళ్ల ప్రాబ్లమ్​ని చెప్పుకోగలుగుతారు.

Tagged support, life style, Females, , Roses are red

Latest Videos

Subscribe Now

More News