ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ థియేటర్లలో విడుదలైంది. రొమాలు నిక్కబొడుచుకునే రీతిలో ఉన్న ఫైటింగ్, యాక్షన్ సీన్లకు తోడు ఆవేశం ఉరకలెత్తించేలా ఉన్న పవర్ ఫుల్ డైలాగులు మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి. ఆంగ్లేయులపై తిరుగుబాటు, బ్రిటీష్ వారిపై పోరాడే నేపథ్యంలో సినిమాలు ఎన్ని వచ్చినా.. రాజమౌళి సత్తా ఏంటో ట్రైలర్ లో ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. 
కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తేజ్ నటించిన ఈ సినిమా ట్రైలర్ గురించి మాటల్లో వర్ణించడం కష్టమే. ‘‘బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన ఎన్టీఆర్ ను ఉద్దేశించి రామ్ చరణ్ చెప్పే ‘‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభ స్థలాన్ని బద్దలుకొడదాం  రా..’ డైలాగ్ ట్రైలర్ రేంజ్ ను పీక్స్ లోకి తీసుకెళుతుంది. 
 బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా నిర్మించిన ఈ సినిమా పై యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను ఉర్రూతలిగిస్తుందనడంలో సందేహం లేదు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన 'ఆర్​ఆర్​ఆర్' టీమ్ ​ ట్రైలర్​ థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
 ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 10 భాషలలో రిలీజ్ కానున్న ఈ పాన్‌ ఇండియా మూవీ థియేట్రికల్‌ ట్రైలర్‌ గురువారం విడుదల అయింది. ఈ సినిమాను వచ్చే జనవరి 7న థియేటర్లలో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ముందస్తుగా రిలీజ్ చేసిన ట్రైలర్ ను చూసేందుకు ఫ్యాన్స్​ థియేటర్లకు భారీగా తరలివచ్చారు. ఈలలు వేస్తూ,  పేపర్​ కటింగ్స్​ను గాల్లోకి ఎగరేస్తూ ట్రైలర్​ను ఎంజాయ్​ చేశారు. థియేటర్ల బయట భారీ సైజ్​ కేక్​లు కట్​ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో ట్రెండింగ్​ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. కింద ఉన్న ట్రైలర్ చూసేయండి.