స్పెషల్ బస్సులకే అదనపు చార్జీలు: ఆర్టీసీ

స్పెషల్ బస్సులకే అదనపు చార్జీలు: ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు:  రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారని జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ యాజమాన్యం ఖండించింది. పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నడిపే స్పెషల్ బస్సులకు మాత్రమే 30 శాతం చార్జీలు పెంచుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వెల్లడించింది.

 ఇప్పుడు కూడా రెగ్యులర్ గా నడిచే బస్సులకు కాకుండా రాఖీ పండగ సందర్భంగా నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే 30 శాతం అదనపు చార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇది ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పండుగలకూ ఉన్నట్టే రాఖీ పండుగకు ఈ విధానాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొంది.