పేదల సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

పేదల సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
  • రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్ రూరల్, వెలుగు: పేదల సంక్షేమమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు అని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ రూరల్, మోపాల్​, డిచ్​పల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు అందజేసి మాట్లాడారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ప్రజా పాలన సాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి  సూచనల మేరకు పల్లెల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వాటి ఫలితంగానే పంచాయతీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్నారు.   కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్​లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.