హాయ్ నాన్న.. ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

హాయ్ నాన్న.. ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్.. శనివారం ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసింది. 

‘సమయమా.. భలే సాయం చేసేవమ్మ ఒట్టుగా.. కనులకే.. తన రూపాన్ని అందించావే గుట్టుగా.. ఓ ఇది సరిపోదా’ అంటూ సాగే పాటలో నాని, మృణాల్  జంట ఆకట్టుకుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన ఈ పాటకు ‘తను ఎవరే.. నడిచే తార, తళుకుళ ధార, తను చూస్తుంటే రాదే నిద్దుర’ అంటూ అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ రాశాడు. 

అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణకుమార్ పాడారు. నాని తండ్రి పాత్రలో నటిస్తుండగా.. కూతురుగా బేబీ కియారా ఖన్నా కనిపించనుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 21న సినిమా విడుదల కానుంది.