ఎలట్రోనిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S26 సిరీస్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లోని అత్యంత ప్రీమియం మోడల్ శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా గురించి సమాచారం లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, Samsung Galaxy S26 అల్ట్రా హై బ్యాటరీ కెపాసిటీ 5,200mAhతో ఉండొచ్చు, ఇది పాత మోడల్ కంటే కొంచెం ఎక్కువ.
ఈ కొత్త S26 అల్ట్రాలో 5,200mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇది పాత మోడల్ S25 అల్ట్రా (5,000mAh) కంటే కొద్దిగా ఎక్కువ. ఈ ఫోన్‌కు 60W వైర్డు (కేబుల్) & 25W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.
లీక్ ప్రకారం పంచ్-హోల్ డిస్‌ప్లే, గుండ్రటి మూలలతో ఉండవచ్చు. అలాగే 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. వెనుకవైపు 200-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10-మెగాపిక్సెల్ కెమెరాలు ఉండవచ్చని కూడా పుకారు వినిపిస్తుంది.
కొన్ని ప్రాంతాలలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoC చిప్‌సెట్, మరికొన్ని ప్రాంతాలలో ఎక్సీనోస్ 2600 SoC ద్వారా ఈ ఫోన్ రన్ అవుతుందని సమాచారం.
