V6 News

సైన్స్ ఫెయిర్ను సక్సెస్ చేయాలి : చైతన్య జైని

 సైన్స్ ఫెయిర్ను సక్సెస్ చేయాలి : చైతన్య జైని
  • ఈనెల 20, 21 తేదీల్లో బల్లెపల్లి ఎస్ఎఫ్ ఎస్ హైస్కూల్ లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్​ 
  • సన్నాహాక సమావేశంలో డీఈవో చైతన్య జైని

ఖమ్మం టౌన్, వెలుగు :  సైన్స్ ఫెయిర్ విజయవంతానికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని పిలుపునిచ్చారు. ఈనెల 20, 21 తేదీల్లో బల్లెపల్లి ఎస్ఎఫ్ ఎస్ హైస్కూల్ లో జరిగే సైన్స్ ఫెయిర్, ఇన్‌స్పైర్ఎగ్జిబిషన్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ల, సభ్యులతో  శుక్రవారం సైన్స్ మ్యూజియంలోని సెమినార్ హాల్​లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని  అందరు ఎంఈవోలు అన్ని మేనేజ్​మెంట్ల హెచ్​ఎం, సైన్స్ టీచర్లు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. 

 ప్రతి కమిటీ కన్వీనర్, సభ్యులు వారి విధులు చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు.  సమావేశంలో కోఆర్డినేటర్ రామకృష్ణ, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి, సీఎంవో ప్రవీణ్ కుమార్, 
జీసీడీవో రూబి. డీసీబీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సైన్స్ ఫెయిర్ కార్యనిర్వాహక సభ్యులు శ్రీనివాసరావు,  మండల విద్యాశాఖ అధికారులు శైలజాలక్ష్మి, శ్రీనివాసరావు, రాములు, వెంకటేశ్వర్లు, వీరస్వామి, మురళీ మనోహర్ రావు, ప్రధానోపాధ్యాయుల సంఘం బాధ్యులు, వివిధ యూనియన్ల రాష్ట్ర , జిల్లా కమిటీ బాధ్యులు  సబ్జెక్టు ఫోరంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కమిటీ కన్వీనర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.