
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఇంటర్మీడియట్‌పరీక్షల్లో ఉమ్మడి జిల్లాలో పూర్ రిజల్ట్స్ వచ్చాయి. మెదక్ జిల్లా ఫస్ట్, సెకండ్ ఇయర్‌లో రాష్ట్రంలో అన్ని జిల్లాలో కంటే చిట్టచివరి స్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లా ఫస్టియర్‌లో 24, సెకండ్ ఇయర్‌లో 16వ స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాకు ఫస్టియర్‌లో 17వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 15వ స్థానం వచ్చింది. కాగా, ఓవరల్‌గా ఎప్పటిలాగే అమ్మాయిలే పైచేయి సాధించారు.
రెండో యేడూ చివరి స్థానమే..
మెదక్ జిల్లా వరుసగా రెండో ఏడు కూడా రాష్ట్రంలో చివరి స్థానంలోనే నిలిచింది. గతేడాది ( 2021–22) ఫస్టియర్‌లో 40 శాతం, సెకండ్ ఇయర్‌లో 47 శాతం మంది స్టూడెంట్స్ పాస్ కాగా ఈ సారి ఫస్టియర్‌లో 38 శాతం, సెకండ్ ఇయర్‌లో 52 శాతం మంది పాసయ్యారు. ఈ సారి (2022 - –23) ఫస్టియర్‌లో మొత్తం 6,364 మంది పరీక్ష రాయగా 2,462 మంది మాత్రమే (38 శాతం) పాసయ్యారు. వీరిలో బాయ్స్2,926 మంది పరీక్ష రాయగా 882 మంది (30 శాతం), గర్ల్స్ 3,438 మంది పరీక్ష రాయగా 1,580 మంది (45 శాతం) పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో మొత్తం 5,320 మంది పరీక్ష రాయగా 2,785 మంది (52 శాతం) పాసయ్యారు. వీరిలో బాయ్స్2,253 మంది పరీక్ష రాగా 1,037 మంది (46 శాతం), గర్ల్స్ 3,067 మంది పరీక్ష రాయగా 1,748 మంది (56 శాతం) పాసయ్యారు. వొకెషనల్ ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 635 మంది పరీక్ష రాయగా 313 మంది ( 49 శాతం), సెకండ్ ఇయర్‌లో 508 మంది పరీక్ష రాయగా 352 మంది (69 శాతం) పాసయ్యారు.
పడిపోయిన సంగారెడ్డి స్థానం
---ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌లో సంగారెడ్డి జిల్లా గతంతో పోలిస్తే చాలా వెనుకబడింది. 2021–--22 ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 12వ స్థానంలో ఉండగా, 2022--–23లో 17వ స్థానానికి పడిపోయింది. 2021 --22 సెకండ్ ఇయర్‌లో ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో ఉండగా, 2022 - -23లో 15వ స్థానానికి చేరింది. ఈ సారి ఫస్ట్ ఇయర్ లో మొత్తం 17,658 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయగా, 10,216 మంది (57 శాతం) మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్ లో 13,995 మంది పరీక్ష రాస్తే 9,270 (66 శాతం) మంది స్టూడెంట్స్ పాసయ్యారు. ఒకేషనల్ లో ఫస్ట్ ఇయర్ 1,487 మంది పరీక్ష రాస్తే 839 మంది స్టూడెంట్స్ పాస్ కాగా, సెకండ్ ఇయర్ లో 1,265 మందిలో 928 మంది స్టూడెంట్స్ పాసయ్యారు.
తొగుట కాలేజీలో 100 శాతం పాస్
ఓవరల్‌గా పూర్ రిజల్ట్ వచ్చినా ప్రభుత్వ కాలేజీల్లోని కొందరు స్టూడెంట్లు సత్తాచాటారు. తొగుట గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు 100 శాతం, మిరుదొడ్డి కాలేజీ విద్యార్థులు 96 శాతం ఉత్తీర్ణులయ్యారు. సిద్దిపేట బాయ్స్కాలేజీలో 66 శాతం, కొండాపూర్ గవర్నమెంట్ కాలేజీలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్66 శాతం పాస్ అయ్యారు. సిద్దిపేట మండలం ఎన్సాన్‌పల్లిలోని రెసిడెన్షియల్ కాలేజీ స్టూడెంట్సాయిశ్రీ ఎంపీసీ సెకండియర్‌లో వెయ్యికి 992 మార్కులు సాధించింది. టీస్‌ఆర్‌ఎస్‌జేసీ ఎంపీసీ స్టూడెంట్ బీ. సాయిశ్రీకి 992, బైసీపీ స్టూడెంట్ సీహెచ్. అనుషకు 987 మార్కులు వచ్చాయి. హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ విద్యార్థిని అశ్వితకు ఎంపీసీలో 986 , గవర్నమెంట్ జూనియర్ కళాశాల విద్యార్థి వర్షకు బైపీసీలో 985 మార్కులు సాధించారు. ఇందులో ఆశ్వితది ఎంపీసీలో జిల్లా ఫస్ట్ , స్టేట్‌లో ఎనిమిదో ర్యాంకు కావడంతో మంత్రి హరీశ్ రావు ఫోన్ ద్వారా అభినందించి ల్యాప్‌టాప్ ఇస్తానని మాటిచ్చారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఆమెను సన్మానించారు.