ఉదయం 9 గంటలైనా వదలని చలి.. కరీంనగర్ సిటీతో పాటు ఉమ్మడి జిల్లా అంతా ఇదే పరిస్థితి !

ఉదయం 9 గంటలైనా వదలని చలి.. కరీంనగర్ సిటీతో పాటు ఉమ్మడి జిల్లా అంతా ఇదే పరిస్థితి !

కొద్ది రోజులుగా చలి పంజా విసురుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు భారీ వర్షాలతో  ఇబ్బందులు పడిన జనం.. ప్రస్తుతం చలితో వణుకుతున్నారు. కరీంనగర్ సిటీతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రంగా ఉంది. మూడు రోజులుగా టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ కనిష్టంగా 10 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదవుతోంది. 

ఉదయం 9 గంటలైనా చలి వదలడం లేదు. దీంతో స్కూల్‌‌‌‌కు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణమంతా మంచు దుప్పట్లో ఉన్నట్లుగా ఉంది. దీంతో రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి.- వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌