ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకే : షబ్బీర్ అలీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకే  : షబ్బీర్ అలీ
  • మాయ మాటలతో మభ్యపెడుతున్న బీజేపీ
  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ

కామారెడ్డి​, వెలుగు : నిజాలు మాట్లాడితే మీడియాపై దాడి చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తుందని  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.  సోమవారం భిక్కనూరు మండలం తిప్పాపూర్​కు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరగా,  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా షబ్బీర్​అలీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం  ఉద్యమకారులను మోసం చేసిందన్నారు.  మాయ మాటలతో మభ్యపెట్టే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 

మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో  మైనార్టీలు, దళితులు,  ఎస్టీలు ఆలోచించాలన్నారు.  అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యమన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేస్తున్నామన్నారు. లైబ్రరీ జిల్లా చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి,  పార్టీ మండలాధ్యక్షుడు భీమ్​రెడ్డి, నాయకులు ఇలియాస్ 
పాల్గొన్నారు.