
- మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్
కోటగిరి,వెలుగు: కోటగిరిలో జరిగిన బోనస్లో అవకతవకలు జరిగాయని బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిరూపిస్తే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్ అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రూ.4.50 లక్షల బోనస్వచ్చినమాట వాస్తవమేనని, తన కుటుంబీకులు 35 ఎకరాల పొలం ఉన్నందునే బోనస్ వచ్చిందన్నారు. తానేమీ బీఆర్‌ఎస్ నాయకుల్లా పర్మిషన్ లేని స్కూళ్లను నడపటంలేదని ఆరోపించారు.
నలభై ఏళ్లుగా మచ్చలేని రాజకీయాలు చేస్తున్న తనపై బురద చల్లడం సరికాదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉమ్మడి మండల కాంగ్రెస్ నాయకులు ఎజాస్ ఖాన్, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగాధర్, పోతంగల్ మాజీ సర్పంచ్ వర్ని శంకర్, కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్,షేరు, హౌగిరిరావు, సుదర్శన్, కృష్ణ, ఒడ్డయ్య పాల్గొన్నారు.