గోదావరిఖని, వెలుగు: సింగరేణి కంపెనీ స్థాయి కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం యైటింక్లయిన్ కాలనీలోని ఏపీజె అబ్దుల్‌కలాం స్టేడియంలో షురూ అయ్యాయి. ఆర్జీ –2 ఏరియా జీఎం బండి వెంకటయ్య ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను చూసి రాబోయే కోల్ఇండియా పోటీల్లో విజేతలుగా నిలవాలని సూచించారు. కబడ్డీ పోటీల్లో కొత్తగూడెం జట్టుపై 15 పాయింట్ల తేడాతో మణుగూరు, ఇల్లందు గ్రూపు జట్టు, రెండో మ్యాచ్‌లో మందమర్రి, బెల్లంపల్లి గ్రూపు జట్టుపై 4 పాయింట్ల తేడాతో శ్రీరాంపూర్జట్టు గెలుపొందాయి.
బాల్‌బ్యాడ్మింటన్ పోటీలో తొలి మ్యాచ్‌లో ఇల్లందు, మణుగూరు గ్రూపు జట్టుపై రామగుండం 1, 2 గ్రూపు జట్టు, రెండో మ్యాచ్‌లో కొత్తగూడెం జట్టుపై భూపాలపల్లి, ఆర్జీ –3 గ్రూపు జట్టు, మూడో మ్యాచ్‌లో రామగుండం 1, 2 గ్రూపు జట్టుపై మందమర్రి, బెల్లంపల్లి గ్రూపు జట్టు, నాలుగో మ్యాచ్‌లో శ్రీరాంపూర్జట్టుపై భూపాలపల్లి, ఆర్జీ –3 గ్రూపు జట్టు, ఐదో మ్యాచ్‌లో మణుగూరు, ఇల్లందు గ్రూపు జట్టుపై మందమర్రి, బెల్లంపల్లి గ్రూపు జట్టు, ఆరో మ్యాచ్‌లో కొత్తగూడెం జట్టుపై శ్రీరాంపూర్జట్టు విజయం సాధించాయి. పర్సనల్ డీజీఎం పి.అరవిందరావు, ఏఐటీయూసీ ప్రతినిధి జిగురు రవీందర్, ఐఈడీ డీజీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు.
