పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కృషి : డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు

పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కృషి : డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు
  • డైరెక్టర్ ​కె.వెంకటేశ్వర్లు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోందని, ఇప్పటివరకు 15 వేల హెక్టార్లలో 7 కోట్ల మొక్కలను నాటిందని ప్రాజెక్ట్స్​, ప్లానింగ్​డైరెక్టర్​కె.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం జీడీకే 1,3 గ్రూప్​మైన్​వద్ద గల ర్యాపిడ్‌‌ గ్రావిటీ ఫిల్టర్​బెడ్​సమీపంలో ఏర్పాటు చేసిన ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్​ప్లాంటేషన్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ట్లాడుతూ సింగరేణిలో మొదటిసారిగా ఆర్జీ 1 ఏరియాలోనే అడవి జాతులు, పండ్ల మొక్కలు నాటి వాటి మధ్య పశుగ్రాసం ఉండేలా ప్లాంటేషన్​ చేస్తున్నట్లు చెప్పారు.

 2025లో సింగరేణి వ్యాప్తంగా 600 హెక్టార్లలో మొక్కలు నాటి పరిరక్షిస్తున్నామని తెలిపారు. ఓపెన్​ కాస్ట్​ మట్టి డంప్‌‌లపై ఖాళీ స్థలాలలో సుమారు 40 నుంచి 50 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. ఏరియా జీఎం డి.లలిత్‌‌కుమార్, ఎస్‌‌వోటూ జీఎం చంద్రశేఖర్, ఫారెస్ట్​డీజీఎం బానోత్​కర్ణ, రవీందర్‌‌‌‌రెడ్డి, అశోక్‌‌రావు, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.