సింగర్ సాయిచంద్ కు సీఎం బుజ్జగింపులు

సింగర్ సాయిచంద్ కు సీఎం బుజ్జగింపులు

మహబూబ్​నగర్, వెలుగు : లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ట్విస్ట్‌‌‌‌ ఇచ్చింది. నామినేషన్లకు కొన్ని గంటల టైం మాత్రమే ఉండగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ క్యాండిడేట్‌‌‌‌ను మార్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదివారం రాత్రి వరకు సింగర్​ సాయిచంద్​ను ఫైనల్​ చేసిన హైకమాండ్​ సోమవారం రాత్రి నాగర్​కర్నూల్ ​జిల్లా కేంద్రానికి చెందిన సిట్టింగ్​ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డికే మళ్లీ బెర్త్‌‌‌‌ కన్ఫాం​ చేసింది. ఇప్పటికే కసిరెడ్డి నారాయణరెడ్డి పేరు ఓకే అయ్యింది. దీంతో రెండుస్థానాల్లో మళ్లీ సిట్టింగ్‌‌‌‌లకే అవకాశం దక్కింది. 

టీఆర్​ఎస్​ రాజకీయ వ్యూహం
నిన్నటి వరకు సిట్టింగ్​ఎమ్మెల్సీ కూచుకుళ్ల పేరును పరిగణలోకి తీసుకోని టీఆర్​ఎస్​ హైకమాండ్ సడెన్‌‌‌‌గా ఆయన పేరు ఖరారు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. 2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి ఆహ్వానించిన సందర్భంలో సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ఎమ్మెల్సీ రెన్యూవల్​ విషయంపై హామీ ఇచ్చారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డికి ఆయనకు కొంత కాలంగా పొసగడం లేదు. దీంతో ఎమ్మెల్యే ఈసారి కూచకుళ్లకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వొద్దని ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది. ఆయనకు అత్యంత సన్నిహితుడైన సాయిచంద్​కు ఈ పదవి ఇవ్వాలని సిఫార్సు చేయడంతో హైకమాండ్ కూడా ఒకే చెప్పింది. అయితే, కూచుకుళ్ల పార్టీ ఫిరాయిస్తే టీఆర్​ఎస్​కు పెద్ద నష్టమే జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్​లో ఉన్న నాగంకు సెకండ్​ క్యాడర్​ లీడర్లు ఉన్నారు.  కూచకుళ్లకు కూడా ప్రతీ విలేజ్​లో ద్వితీయ శ్రేణి నాయకుల బలం ఉంది. మర్రికి మాత్రం నియోజకవర్గంలో ఆ స్థాయిలో సెకండ్​ క్యాడర్​ లీడర్ల మీద పట్టు లేదు. అయితే, కూచకుళ్ల కాంగ్రెస్​తో చేయి కలకపోయినా, బీజేపీలో ఉన్న డీకే అరుణతో పరిచయం ఉండటంతో ఆ పార్టీలోకి వెళ్లే సూచనలు ఉండేవి. అదే జరిగితే, రాజకీయంగా ఎమ్మెల్యే మర్రికి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్​లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. మూడు పార్టీల నుంచి మర్రి, నాగం, కూచుకుళ్ల పోటీ పడితే, ఫైట్ నాగం వర్సెస్​ కూచుకుళ్లగా మారుతుంది. దీంతో మర్రికి ఎఫెక్ట్​ పడుతుందని ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​ ఇవ్వడంతో హైకమాండ్​ వెనకడుగు వేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే  మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. 

సాయిచంద్‌‌కి మొండిచెయ్యి

 వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన సాయిచంద్​కు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ మళ్లీ మొండిచెయ్యి చూపింది. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన పేరు ప్రస్తావనకు తీసుకొచ్చారు.  సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కూడా హామీ ఇచ్చారు. కానీ, లాస్ట్​ మూమెంట్​లో కసిరెడ్డి నారాయణరెడ్డిని తెరమీదికి తీసుకొచ్చి పదవి కట్టబెట్టారు.  ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సేమ్​ సీన్​ రిపీట్​ చేశారు.  కాగా, ఈ విషయంపై సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సాయిచంద్​ను బుజ్జగించినట్లు తెలిసింది.

తెరమీదికి సామాజిక సమీకరణలు
టీఆర్​ఎస్​ హైకమాండ్​ ఎమ్మెల్సీగా సాయిచంద్​ పేరును ప్రకటించిన కొన్ని గంటల్లోనే  కుల సమీకరణలు తెరమీదకు వచ్చాయి. ఈయన మాల సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే ఇదే సామాజిక వర్గానికి చెందిన నాగర్​కర్నూల్​ జిల్లాలోని గౌరారం గ్రామానికి చెందిన గాయకుడు గోరటి వెంకన్న గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.  దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు సాయిచంద్‌‌‌‌ను వ్యతిరేకించినట్లు తెలిసింది. అంతేకాదు ఒకవేళ కూచుకుళ్ల పార్టీ మారితే  స్థానికంగా మర్రి జనార్దన్‌‌‌‌ రెడ్డికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ సిట్టింగ్‌‌‌‌కే అవకాశం ఇచ్చినట్లు సమాచారం.