హైదరాబాదీల 5 పాపులర్ నిక్ నేమ్స్ ఇవే..

హైదరాబాదీల 5 పాపులర్ నిక్ నేమ్స్ ఇవే..

చింటూ.. నానీ.. చిన్నా.. కన్నా.. అమ్మూ.. ఏంటీ పేర్లు అనుకుంటున్నారా.. హైదరాబాదీలకు సహజంగా అలవాటు అయిన నిక్ నేమ్స్.. ఫ్రెండ్స్ లేదా బాగా దగ్గర అయిన వారిని లేదా ఇంట్లో పిల్లలను ఎక్కువగా ఇలాంటి పేర్లతోనే పిలుస్తున్నారంట.. ఈ ఐదు నిక్ నేమ్స్ అనేవి ఇప్పుడు హైదరాబాదీలు ఎక్కువగా ఉపయోగిస్తున్న పదాలు అని ఆన్ లైన్ సర్వే స్పష్టం చేస్తుంది.

హైదరాబాదీలు అయితే ఈ ఐదు పేర్లతో పిలుస్తున్నారు.. మరి ఇండియా మొత్తంగా ఎక్కువగా ఉపయోగించే నిక్ నేమ్స్ లిస్ట్ కూడా ఉందండీ.. అవేంటో తెలుసా.. సోను, బాబు, మచ్చా, షోనా, పింకీ అనే నిక్ నేమ్స్ దేశంలోని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

హైదరాబాదీల్లో చాలా మంది యూత్.. తమకు ఇష్టమైన అమ్మాయిని.. లవర్ ను అమ్మూ అని పిలుస్తున్నారంట.. అంతే కాకుండా మరికొంత మంది అయితే బుజ్జీ అని పిలుస్తారు. ఇంట్లో చిన్న పాపలను అయితే అమ్మూ అనే నిక్ నేమ్ తో పిలుస్తున్నారు.

సగం కంటే ఎక్కువ మంది తమ జీవితంలో ఏదో ఒక దశలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మారుపేర్లను కలిగి ఉన్నారని ఈ సర్వే చెబుతోంది. కేవలం 15% మంది మాత్రమే తమ మారుపేర్లను బహిరంగంగా ఉపయోగించడానికి ఇబ్బందిపడుతున్నారని చెప్పారు.

ALSO READ:రైతు సేవా సహకార సంఘంలో పెట్రోల్ బాటిల్ తో రైతు ఆందోళన

ఈ అధ్యయనం స్నాప్‌చాట్‌లో రెండు కొత్త నిక్ నేమమ్- థీమ్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ లెన్స్‌లను ప్రవేశపెట్టేందుకు కారణమైంది. ఈ క్రమంలో స్నాప్ చాట్ లో ఇండియాలోని టాప్ నిక్ నేమ్స్, మై నిక్ నేమ్ అనే పేర్లతో జూన్ 21న కొత్త లెన్సులు ప్రారంభమయ్యాయి. మొదటి లెన్స్‌లో భారతదేశంలో చాలా మంది పెట్టుకునే పేర్లు, ఐదు బెస్పోక్ డిజైన్‌లు ఉన్నాయి. ఇక యూజర్స్ తమ స్వంత నిక్ నేమ్ ను సృష్టించుకోవడానికి 'మై నిక్ నేమ్' లెన్స్‌ను ఉపయోగించవచ్చు.