పుట్టిన రోజు నాడే..: కాలువలో పడిన పిల్లలను కాపాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గల్లంతు

పుట్టిన రోజు నాడే..: కాలువలో పడిన పిల్లలను కాపాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గల్లంతు

కర్నూలు: కాలువలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న పిల్లలను ప్రమాదం నుంచి కాపాడాడు కానీ.. ఆ తర్వాత నీటి ప్రవాహం ఉధృతిలో ఈదలేక.. అలసిపోయి  గల్లంతయ్యాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. జిల్లాలోని నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామం వద్ద జరిగిందీ ఘటన. శనివారం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లక్ష్మికాంత్ రెడ్డి (41) పుట్టినరోజు. గ్రామంలోని కాలువ మీదుగా వెళ్తుండగా.. ఇద్దరు పిల్లలు కాలువలో కాళ్లు కడుక్కునే ప్రయత్నంలో జారిపడ్డారు. ఇది గుర్తించిన లక్ష్మికాంత్ రెడ్డి వేగంగా స్పందించి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను ఒడ్డుకు చేర్చాడు. అటు తర్వాత తనకు తాను ఒడ్డుకు రాలేక.. నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. గ్రామస్తులు కె.సి కెనాల్ వెంట పరుగులు తీస్తూ లక్ష్మికాంత్ రెడ్డి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.