
జిన్నారం, వెలుగు: ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మండలంలోని 11 గ్రామాల్లో సోలార్ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేసినట్లు బీజేపీ మండలాధ్యక్షుడు కొత్త కాపు జగన్ రెడ్డి అన్నారు. ఆదివారం సోలక్ పల్లి గ్రామంలో సోలార్ ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిన్నారం మండలంలోని 11 గ్రామాలకు ఐమాక్స్ లైట్లు వేయించామని, మిగతా గ్రామాలకు రెండో విడతలో వస్తాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిన్నారం మండలంలోని గ్రామాలను పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు.
ఎంపీ రఘునందన్ రావు చీకట్లో మగ్గిన గ్రామాలకు వెలుగులను నింపుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాపరెడ్డి, సీనియర్ నాయకులు నర్సింగరావు, సుధాకర్, నల్లగండ్ల అశోక్ కుమార్, కృష్ణ, దేవేందర్, ఆంజనేయులు, వీరేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.