ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తా

ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తా

ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించటమే తన కల అని అన్నారు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌. ఇప్పటికే  కరోనా తో పాటు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తున్నారు సోనూ. అంతేకాదు.. తాను ఉన్నానంటూ ఎంతో మందికి భరోసా నిస్తున్నారు.

కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లను చూసి తన మనసు చెలించిపోయిందని.. చేతనైనంత సాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చానంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సోనూ సూద్. ఈ సేవా కార్యక్రమాల్లో మా కుటుంబం మొత్తం అండగా ఉందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేలా  స్కూళ్లు ,ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ఉందన్నారు.  అయితే .. అది ఇప్పుడే సాధ్యం కాని పని అని అన్నారు. ఉచిత వైద్యం అందించేలా ఆస్పత్రులు మాత్రం నిర్మించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానన్న సోనూ.. తప్పకుండా అది చేస్తానని తెలిపారు.

ఇవాళ(సోమవారం) క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిషేక్‌ జైన్‌ అనే కుర్రాడిని సోనూసూద్‌ తన నివాసంలో కలుసుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలను తెలుసుకుని.. చిన్న కానుకను అందించారు.