భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్లో ఉన్న కేసుల త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో మంగళవారం పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, రైటర్లు, టెక్ టీం ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ కేసుల త్వరగా పరిష్కరించేలా చూడాలన్నారు.
కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కేసు నమోదైనప్పటి నుంచి పరిష్కారమయ్యేంత వరకు ప్రతీ విషయాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను రిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రాముతో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
