
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్‌కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్‌రాజు సూచించారు. చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేసేలా వారితో బాధ్యతాయుతంగా మెలగాలన్నారు.
పోలీస్ స్టేషన్ పై అంతస్థులోని జిల్లా సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్‌ను సందర్శించారు. జిల్లాలో నమోదైన సైబర్ క్రైమ్స్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.