న్యూఢిల్లీ : క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ), వారెంట్స్ ఇష్యూ చేయడం , ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా రూ.3,200 కోట్లు సేకరించాలని స్పైస్‌జెట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ అయిన విమానాలను తిరిగి సర్వీస్‌లలోకి తెచ్చేందుకు ఈ ఫండ్స్‌ను వాడనుంది. అంతేకాకుండా అప్పులు తీర్చడానికి, సర్వీస్‌లోకి కొత్త విమానాలను తెచ్చేందుకు, ఇతర అవసరాలకు ఈ ఫండ్స్‌ను వినియోగించనుంది. క్యూఐపీ ద్వారా రూ.2,500 కోట్లను, వారెంట్లను ఇష్యూ చేయడం ద్వారా, ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా మరో రూ.736 కోట్లను సేకరించాలని స్పైస్‌జెట్ ప్లాన్ చేస్తోందని ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్‌లో కంపెనీ పేర్కొంది.
ఈ ఫండ్స్ సేకరణ షేర్‌హోల్డర్ల అనుమతులపై ఆధారపడి ఉంది. కిందటేడాది డిసెంబర్‌లో రూ.2,250 కోట్లు సేకరిస్తామని స్పైస్‌జెట్ ప్రకటించింది. కానీ, కేవలం రూ.1,060 కోట్లను మాత్రమే ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా సేకరించగలిగింది. విమానాలు తగ్గడం, వర్కింగ్ క్యాపిటల్ ఖర్చులు పెరగడం, ఫిక్స్డ్ ఖర్చులు పెరగడం, ఎయిర్‌పోర్ట్‌ల వద్ద ఫిక్స్డ్ రెంటల్స్, బకాయిలు వంటి సమస్యలను స్పైస్‌జెట్ ఎదుర్కొంటోంది. సర్వీస్‌లో ఉన్న కంపెనీ విమానాలు 2019 లో 74 ఉంటే ఈ ఏడాది 28 కి పడిపోయాయి. ఫండింగ్ ఇష్యూ వలన 38 విమానాలు గ్రౌండ్ అయ్యాయి.