పిల్లల టీకా విషయంలో సక్సెసయిన ఫైజర్ ట్రయల్స్‌‌

పిల్లల టీకా విషయంలో సక్సెసయిన ఫైజర్ ట్రయల్స్‌‌
  • సెకండ్​ డోస్​ తర్వాత యాంటీబాడీలు ఏర్పడినయ్​
  • అమెరికాలో అనుమతికి త్వరలో అప్లై చేస్తామన్న సంస్థ

వాషింగ్టన్​: 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు తమ కరోనా వ్యాక్సిన్​ సురక్షితమని అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్​ వెల్లడించింది. యూఎస్​లో ఈ ఏజ్​గ్రూప్​ పిల్లలకు అత్యవసర వాడకానికి అనుమతి కోసం త్వరలోనే అప్లై చేసుకుంటామంది. 2,268 మంది ఎలిమెంటరీ స్కూల్​ పిల్లలపై (5 నుంచి 11 ఏళ్ల వాళ్లు) ఫైజర్​ వ్యాక్సిన్ ​ట్రయల్స్​ చేశామని, మామూలు డోసులో మూడో వంతు ఇచ్చామని సంస్థ వెల్లడించింది. రెండో డోసు తర్వాత పిల్లల్లో కరోనా యాంటిబాడీలు పెద్దవాళ్లలానే డెవలప్​ అయ్యాయంది.  జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి చిన్న చిన్న సైడ్​ ఎఫెక్ట్స్​ కనిపించాయని చెప్పింది. ఫైజర్​, బయో ఎన్​టెక్​ కలిసి డెవలప్​ చేసిన ఈ వ్యాక్సిన్​ఇప్పటికే12 ఏళ్లు పైబడిన వాళ్లకు అందుబాటులో ఉంది. మోడెర్నా కూడా పిల్లలపై​ ట్రయల్స్​ చేస్తోంది. 6 నెలలు, ఆ తర్వాత పిల్లలపై కూడా ఫైజర్, మోడెర్నా ట్రయల్స్​ ప్రారంభించాయి. ఈ ఏడాదిలోనే వీటి రిజల్ట్స్​ రానున్నాయి. క్యూబా కూడా తమ దేశంలోనే తయారుచేసిన టీకా​ను 2 ఏళ్ల పిల్లలకు ​వేయడం స్టార్ట్​ చేసింది. చైనాలో మూడేళ్ల పైబడిన వాళ్లకు వ్యాక్సిన్​ వేస్తున్నారు.
అమెరికాలో పెరుగుతున్న పిల్లల కేసులు
అమెరికాలో కరోనా స్టార్టయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది పిల్లలకు వైరస్​ సోకింది. వీళ్లలో 460 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. డెల్టా కేసులు పెరగడం మొదలైన తర్వాత చిన్న పిల్లల కేసులు కూడా ఎక్కువైనయ్.  ఇప్పుడిప్పుడే పిల్లలు స్కూళ్లకు వెళ్తుండటం, డెల్టా రకం వల్ల పీడియాట్రిక్​ కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నారు.

మాస్కులు టైట్​గా ఉండాలె
గాలి ద్వారా ఈజీగా వ్యాపించేలా కరోనా వైరస్​ మార్పులు చెందుతోం దని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ మేరీలాండ్​సైంటిస్టులు చెప్పారు. టీకాలు వేసుకున్నా కూడా ప్రజలు మాస్కులు పెట్టుకోవాలని, అవి టైట్​గా ఉండేలా చూసుకోవాల ని సూచించారు. తాముండే చోట్ల వెంటిలేషన్​ బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా సోకిన వ్యక్తులు గాలిని బయటకు వదిలేట ప్పుడు వైరస్​ను వదులుతున్నారని చెప్పారు. ఒరిజినల్​ స్ట్రెయిన్​ వైరస్​తో ఇన్​ఫెక్టయిన వాళ్లతో పోలిస్తే అల్ఫా వేరియంట్ బాధితులు 43 నుంచి 100 రెట్లు ఎక్కువగా వైరస్​ను గాల్లోకి వదులుతున్నారన్నారు.