సుధీర్ బాబు హరోంహర.. అంచనాలు పెంచేస్తున్న వరుస అప్డేట్స్

సుధీర్ బాబు హరోంహర.. అంచనాలు పెంచేస్తున్న వరుస అప్డేట్స్

సుధీర్ బాబు (Sudheerbabu) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్-డ్రామా మూవీ హరోమ్ హర (Harom Hara). ఈ మూవీలో సునీల్ క్యారెక్టర్కు సంబంధించిన పోస్టర్‌ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పళని సామి అనే తమిళ క్యారెక్టర్ను పోషిస్తున్నాడు సునీల్. రిలీజ్ చేసిన పోస్టర్ను గమనిస్తే..గతానికి సంబంధించిన ఫైల్..దాని చుట్టూ పేపర్ కటింగ్స్..తుపాకీ..బుల్లెట్లు..సీరియస్ లుక్లో సునీల్ను చూపించి ఇంట్రెస్ట్ పెంచారు. 

లేటెస్ట్గా మరో ముగ్గురి క్యారెక్టర్స్కు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ క్రమంలోనే నవంబర్ 27న పవర్ ఆఫ్ సుబ్రమణ్యం అంటూ సుధీర్ బాబు హరోం హర టీజర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ హరోంహర సినిమాలో యాక్టర్ అర్జున్ గౌడ..శరత్ రెడ్డి పాత్రలో..తమ్మి రెడ్డి పాత్రలో లక్కీ లక్ష్మణ్, ఇక బసవ రెడ్డి పాత్రలో రవి కాలే నటిస్తున్నారు. ఈ పోస్టర్స్ తోనే ఇంటెన్సిటీ కలిగించారు మేకర్స్. అంతేకాకుండా ఈ సినిమాలో సునీల్తో పాటుగా..ఆసక్తి కలిగించే ఈ మూడు పాత్రలు కూడా చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. 

హరోమ్ హర మూవీని 1989 బ్యాక్ డ్రాప్తో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక. ఈ సినిమా కోసం సుధీర్ బాబు చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట.అలాగే, ఈ మూవీని తెలుగు ప్రాంతాల వరకే కాకుండా..పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో రానున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.