
మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉండటం రోహిత్ కు పెద్ద సవాలేనన్నారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అలాగే ఫిట్ నెస్ విషయంలో కెప్టెన్ గా రోహిత్ పెద్ద సవాలు ఎదుర్కొబోతున్నాడన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు బాగా ఆడేలా చూసుకోవడం రోహిత్ కు పెద్ద సమస్య అన్నారు. క్రికెటర్లు మానసికంగా ఫిట్ గా ఉండేలా చూసుకోవాలన్నారు. మార్చిలో శ్రీలంకతో టెస్టు సిరీస్, ఆ తర్వాత రెండు నెలలు ఐపీఎల్ మ్యాచులు ఆడనున్నారు. అనంతరం సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ లతో టీ20 సిరీస్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్లు తమ ఫామ్, ఫిట్ నెస్ ను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అని సునీల్ గవాస్కర్ అన్నారు.