17 మంది హైకోర్టు జడ్జిల బదిలీకి కొలీజియం సిఫారసు

17 మంది హైకోర్టు జడ్జిల బదిలీకి కొలీజియం సిఫారసు
  • 5 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ
  • తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిసగా సతీష్‌ చంద్ర శర్మ
  • ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 17 మంది హైకోర్టు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈనెల 16వ తేదీన సుప్రీం కోర్టు కొలీజియం  భేటీ అయి తీసుకున్న నిర్ణయాలను మంగళవారం బహిర్గతం చేశారు. కొలీజియం నిర్ణయాల్లో భాగంగా ఐదు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా బదిలీ చేశారు. అలాగే 8 మంది న్యాయమూర్తులకు ప్రమోషన్‌ కల్పించారు.
ఐదు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కూడా కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిసగా సతీష్‌ చంద్ర శర్మను నియమించినట్లు కొలీజియం పేర్కొంది. 
బదిలీల్లో భాగంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామిని చత్తీస్‌ఘడ్‌  హైకోర్టుకు బదిలీ చేశారు. వీరితో పాటు 17 మంది జడ్జీలను బదిలీ చేస్తూ కూడా కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ బదిలీల్లో భాగంగా అలహాబాద్‌ నుంచి రవినాత్‌ తిల్హారి ఏపీ హైకోర్టుకు వస్తుండగా..  బాంబే హౌకోర్టు నుంచి ఉజ్వల్‌ భుయాన్‌ తెలంగాణ హైకోర్టుకు వస్తున్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి ఎంఎస్‌ఎస్‌ రామ చంద్రరావు పంజాబ్‌ అండ్‌ హర్యానా రాష్ట్రాల హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.