లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్

విశాఖపట్టణం: రైతు పొలాన్ని సర్వే చేయడానికి 11వేలు లంచం తీసుకుంటూ పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. బ్రాందేయపురంలో నాలుగు ఎకరాల భూమికి సర్వే చేయడానికి 18 వేలు లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ తర్వాత కొంత మెత్తపడి 11 వేలకు దిగివచ్చాడు. అయితే బాధిత రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఏసీబీ అధికారులిచ్చిన రూ.11 వేలు నగదు తీసుకుని సర్వేయర్ ఉపేంద్రకు సమాచారం ఇవ్వగా ఆఫీసుకు వచ్చి ఇమ్మని చెప్పాడు. గురువారం ఆఫీసుకు వెళ్లి లంచం డబ్బు అందజేసిన వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ లంచం డబ్బు కోసం నేరుగా కాకుండా మధ్యవర్తిత్వం వహించిన బ్రాందేయపురం, మిద్దె సచివాలయ సర్వేయర్లును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.