
- స్థానికుల ఫిర్యాదుతో స్వీట్హౌజ్ సీజ్
దహెగాం, వెలుగు: గణేశ్మండపం వద్ద భోజనాల్లో స్వీట్పెట్టేందుకు ఓ స్వీట్హౌజ్నుంచి తెచ్చిన బాదుషాలు కుళ్లిపోయి ఉన్నాయి. దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సదరు స్వీట్హౌజ్ను అధికారులు సీజ్ చేశారు. దహెగాం మండల కేంద్రంలో శ్రీ గణేశ్ మండలి వద్ద బుధవారం తుమ్మిడి వెంకన్న అనే భక్తుడు అన్నప్రసాదం ఏర్పాటు చేశాడు. స్వీట్కోసం మండల కేంద్రంలోని బాలాజీ స్వీట్‌హౌజ్‌లో బాదుషా ఆర్డర్ చేయగా షాపు ఓనర్ కుళ్లిపోయిన బాదుషాలు సప్లై చేశాడు. తిన్న కొంతమందికి టేస్టులో తేడా రావడంతో బాదుషాను విప్పి చూడగా లోపల కుళ్లిపోయి ఉంది.
దీంతో స్థానికులు సదరు స్వీట్ షాపునకు వెళ్లి ఓనర్‌ను బాదుషాలు తినమన్నారు. తాను తిననని కరాఖండిగా చెప్పి దురుసుగా ప్రవర్తించాడు.
దీంతో వారు పోలీస్ స్టేషన్లో, తహసీల్దార్కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ తహసీల్దార్గణేశ్వెళ్లి సదరుస్వీట్హౌజ్ను పరిశీలించి సీజ్‌చేశారు. అనంతరం ఫుడ్‌సెక్యూరిటీ అధికారులకు సమాచారమివ్వగా ఫుడ్షాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపించి తదుపరి చర్యలకు సంబంధిత అధికారులకు రిపోర్టు అందించనున్నట్లు పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వ్యాపారస్తులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్వీట్హౌజ్ను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్‌చేశారు.