ఆర్మీలో టెక్నికల్​ జాబ్స్​

ఆర్మీలో టెక్నికల్​ జాబ్స్​

ఆర్మీలో లెఫ్ట్‌‌నెంట్ ర్యాంక్ హోదా క‌‌లిగిన టెక్నిక‌‌ల్ గ్రాడ్యుయేట్ పోస్టుల భ‌‌ర్తీకి ఇండియ‌‌న్ ఆర్మీ నోటిఫికేష‌‌న్ విడుద‌‌ల చేసింది. జనవరి 2022 లో ప్రారంభమయ్యే 134వ టెక్నికల్‌‌ గ్రాడ్యుయేట్‌‌ కోర్సు (టీజీసీ) పోస్టులకు అవివాహితులైన పురుష ఇంజినీరింగ్‌‌ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్​ ప్రాసెస్​  ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌‌ 15వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 40
పోస్టులు: సివిల్‌‌/ బిల్డింగ్ క‌‌న్‌‌స్ట్రక్షన్ టెక్నాల‌‌జీ - 10,  ఆర్కిటెక్చర్ విభాగం -1, మెకానిక‌‌ల్ విభాగం - 2, ఎల‌‌క్ట్రిక‌‌ల్‌‌/ఎల‌‌క్ట్రానిక్స్ - 3, కంప్యుట‌‌ర్ సైన్స్ అండ్ టెక్నాల‌‌జీ -3, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేష‌‌న్ -1, మైక్రో ఎల‌‌క్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ -1, ఏరోనాటిక‌‌ల్, ఎరోస్పేస్‌‌ విభాగం -1,ఏవియానిక్స్ విభాగంలో -1, ఎల‌‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌. -2, ఫైబ‌‌ర్ ఆప్టిక్స్ -1, ప్రొడ‌‌క్షన్‌‌ - 1, ఇండ‌‌స్ట్రియ‌‌ల్‌‌/ మాన్యుఫాక్చరింగ్‌‌/ ఇండ‌‌స్ట్రియ‌‌ల్ అండ్‌‌ మేనేజ్‌‌మెంట్ -1, వ‌‌ర్క్‌‌షాప్ టెక్నాల‌‌జీ విభాగం -1 లో పోస్టులు ఉన్నాయి. 
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజ‌‌నీరింగ్ ఉత్తీర్ణులైన (ఫైన‌‌లియ‌‌ర్ స్టూడెంట్స్​ కూడా అప్లై చేసుకోవచ్చు) అభ్యర్థులు అర్హులు.
వ‌‌య‌‌సు: 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌‌ లిస్టింగ్‌‌, ఎస్‌‌ఎస్‌‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌‌ ఎగ్జామినేషన్‌‌ ఆధారంగా ఎంపిక.
దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్స్​ ప్రారంభం: 17 ఆగస్టు
చివరితేది: 15 సెప్టెంబర్‌‌
వెబ్‌‌సైట్‌‌: www.joinindianarmy.nic.in