ఇకపై 9999 నంబర్‌‌‌‌‌‌‌‌కు లక్షన్నర

ఇకపై 9999 నంబర్‌‌‌‌‌‌‌‌కు లక్షన్నర
  • 1, 9, 6666 నంబర్లకు  లక్ష వసూలు
  • ఫ్యాన్సీ నంబర్ల ఫీజులను పెంచుతూ ఆర్టీఏ జీవో 

హైదరాబాద్​సిటీ, వెలుగు: కొత్త వాహనాలకు ప్రత్యేక (ఫ్యాన్సీ) నంబర్లు కేటాయించే ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. తెలంగాణ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం కొత్త ధరలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది.  దీనికి సంబంధించి శనివారం జీవో77ను జారీ చేసింది. ప్రస్తుతం 9999 అనే ఫ్యాన్సీ నంబరుకు రూ.50 వేలు ఫీజు ఉండగా..కొత్త జీవో ఇక నుంచి రూ.1.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.అలాగే 1, 9, 6666 నంబర్లకు గతంలో రూ.50 వేలు ఉండగా, ఇప్పుడు రూ.1 లక్ష వసూలు చేయనున్నారు. అదేవిధంగా 99, 999, 3333, 4444, 5555, 7777 వంటి నంబర్లకు రూ.50 వేలుగా ఫీజు నిర్ణయించారు. పోటీ పెరిగితే వేలంలో ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే ఆయా నంబర్లను కేటాయిస్తారు.ఇప్పటివరకు 555, 666, 777, 888, 2222, 3333, 4444, 5555, 6666, 8888 నంబర్లకు ఫీజు రూ.30 వేలు ఉండగా, దాన్ని రూ.50 వేలకు పెంచారు. 

5, 6, 7, 123, 333, 369, 1111, 1116, 1234, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 4455, 4545, 4599, 6669, 6789, 8055 వంటి నంబర్లకు గతంలో రూ.20 వేలు ఉండగా, ఇప్పుడు రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా నంబర్లను రిజర్వ్ చేసుకున్న వారు ఆర్టీఏ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. బిడ్​లో పాల్గొనని వాహనదారుడు చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.