పునాస పత్రికను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

పునాస పత్రికను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాహిత్య అకాడమీ పునాస పత్రికను ప్రచురించడం గొప్ప విషయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రముఖుల శతజయంతి సందర్భంగా ప్రత్యేక సంచికలు తీసుకురావడం అభినందనీయమన్నారు. మంగళవారం తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన ఆచార్య బిరుదురాజు రామరాజు ప్రత్యేక సంచిక 'పునాస'ను మంత్రి ఆవిష్కరించారు. రామరాజు లాంటి గొప్ప పండితుడు, పరిశోధకుడు తెలంగాణలో జన్మించడం ఈ నేల చేసుకున్న అదృష్టమని తెలిపారు. 

గతేడాది కూడా దాశరథి కృష్ణమాచార్య పైన ఓ ప్రత్యేక సంచికను తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిందని గుర్తు చేశారు. ఇలాంటి సాహిత్య పరమైన కార్యక్రమాలు చేయడంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి కృషి ఎంతో ఉన్నదని కొనియాడారు. ఈ  కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, కవి యాకుబ్, దినకర్, కవి మిత్రులతో పాటు సాహిత్య అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు.