నేషనల్ కబడ్డీ పోటీల రాష్ట్ర జట్ల ఎంపిక

నేషనల్ కబడ్డీ పోటీల రాష్ట్ర జట్ల ఎంపిక

ఆర్మూర్​, వెలుగు: ఈ నెల 25 నుంచి 28 వరకు చండీగఢ్ లో జరుగనున్న సీనియర్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్​ షిప్​ పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక ఆదివారం ఆర్మూర్‌‌లో జరిగింది. ఆర్మూర్​టౌన్​లోని జడ్పీ బాయ్స్​ హైస్కూల్ గ్రౌండ్​లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహించి రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు.  22 జిల్లాల నుంచి ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఎంపిక పోటీలకు హాజరయ్యారు.

అమెచ్యూర్  కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్న తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక నిర్వహించామని   జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ దాస్ తెలిపారు. సీనియర్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్​ షిప్​ కు ఎంపికైన జట్టు క్రీడాకారులకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అభినందించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గంగా మోహన్ చక్రు, లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ రాజన్న, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి బాబన్న, సలహాదారులు అమరనాథ్ రెడ్డి, కొక్కుల రమాకాంత్, ఎస్. గంగాధర్, మునిరాజ్, నాగేశ్, రాకేశ్, ఇతర జిల్లాల కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శులు, క్రీడాకారులు పాల్గొన్నారు.