దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, లాప్టాప్‌లు

దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, లాప్టాప్‌లు

వికారాబాద్​, వెలుగు: తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2025–26 ఆర్ధిక సంవత్సరానికి శారీరక దివ్యాంగులకు, అంధులకు, బధిరులకు బ్యాటరీ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, లాప్ టాప్స్ (డిగ్రీ విద్యార్థులకు), హియరింగ్ ఎయిడ్స్ ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వికారాబాద్ జిల్లా సంక్షేమాధికారిణి క్రిష్ణవేణి తెలిపారు. అర్హులు https://tgobmms.cgg. gov.in  వెబ్​సైట్​లో ఈ నెల 30వ తేదీ లోపు అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.