తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన

తెలుగు వర్సిటీ సాహితీ  పురస్కారాల ప్రకటన

హైదరాబాద్, వెలుగు: తెలుగు సాహి త్యంలో వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు 2023వ సంవత్సరానికి సాహితీ పురస్కారాలను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ  ప్రకటించింది. పద్యకవితలో సదా శివ శర్మ, వచన కవితలో విజ్జుపల్లి వాసిని , గేయ కవి తలో ఏనుగు నర సింహారెడ్డి, బాలసాహిత్యంలో యం. హరి కిషన్, కథానికలో టి. సంపత్ కుమార్, నవలలో పులికొండ సుబ్బ చారి, సాహిత్య విమర్శలో ఆడెపు లక్ష్మీపతి , నాటకం/నాటికల్లో రావుల పుల్లాచారి, అనువాద సాహిత్యంలో టీసీ వసంత, వచన రచన విభాగంలో పేట శ్రీనివాసులు రెడ్డి, రచయిత్రీ ఉత్తమ గ్రంథం విభాగంలో జంధ్యాల కనకదుర్గ గ్రంథాలు సాహితీ పురస్కారానికి ఎంపికయ్యాయి. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నెల 29న వర్సిటీలో పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు.