V6 News

డిసెంబర్ 22 నుంచి ‘టీజీ సెట్’ పరీక్షలు

డిసెంబర్ 22 నుంచి  ‘టీజీ సెట్’ పరీక్షలు
  • సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఓయూ

హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్)- పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో మూడు రోజుల పాటు ఆన్‌‌‌‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు జరగనున్నాయని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. 

ఈ పరీక్షలను 45 వేల మంది అభ్యర్థులు రాయనుండగా, వారికోసం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్‌‌‌‌ టికెట్లను అధికారిక వెబ్‌‌‌‌సైట్లు www.telanganaset.org లేదా www.osmania.ac.in నుంచి డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.  మొత్తం 29 సబ్జెక్టులకు రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలుంటాయి.